... ప్రేమగా జీవించు
వంశీ కలుగోట్ల // ... ప్రేమగా జీవించు //
********************************************
ఏ తీరున యోచించినన్
ఏ దిక్కున పరికించినన్
కన్పట్టుచుండిరి ప్రియుల్
భావింపకుమన్యదా నాపలుకుల్
పలురకములీ ప్రియుల్
యనిదెల్పుటయే దప్పించి
లేదిచట మారుద్దేశము
******************************
ఏ తీరున యోచించినన్
ఏ దిక్కున పరికించినన్
కన్పట్టుచుండిరి ప్రియుల్
భావింపకుమన్యదా నాపలుకుల్
పలురకములీ ప్రియుల్
యనిదెల్పుటయే దప్పించి
లేదిచట మారుద్దేశము
మదిభారము బోవునని
ఎవరో సెలవివ్వగన్
మధుశాలకు నేను బోవ
కన్పడిరి యచట
మధుపాన ప్రియుల్
ఎవరో సెలవివ్వగన్
మధుశాలకు నేను బోవ
కన్పడిరి యచట
మధుపాన ప్రియుల్
ప్రకృతి పరవశింపజేయున్
యని పచ్చటి పల్కుల విని
ఉద్యానవనమున కేగ కాంచితిని
యచటన్ కాంతా ప్రియులన్
యని పచ్చటి పల్కుల విని
ఉద్యానవనమున కేగ కాంచితిని
యచటన్ కాంతా ప్రియులన్
చల్లగాలికి తిరుగుదుమని
పిల్లగాలికి యారాటపడుచు
సంజె చీకట్లమాటున
వాడలవెంట తిరుగుచున్న
వారదిగో రసిక ప్రియుల్
పిల్లగాలికి యారాటపడుచు
సంజె చీకట్లమాటున
వాడలవెంట తిరుగుచున్న
వారదిగో రసిక ప్రియుల్
ప్రపంచమును ప్రక్కకు త్రోసివేసి
అక్షరమును ఆస్వాదించుటకున్
మించిన యానందమున్నదాయంచు
గ్రంథాలయ మునకేగు
అక్షరమును ఆస్వాదించుటకున్
మించిన యానందమున్నదాయంచు
గ్రంథాలయ మునకేగు
చున్నారాదిగో పుస్తక ప్రియుల్
తలిదండ్రుల, మిత్రుల మించి
తెరమీది బొమ్మలను వేల్పులుగ
తలచుచు దారినబోవుచున్నా
రదిగో సినిమా ప్రియుల్
తెరమీది బొమ్మలను వేల్పులుగ
తలచుచు దారినబోవుచున్నా
రదిగో సినిమా ప్రియుల్
...
...
...
వివరించవలెనా ఇంకనూ
ప్రేమించగలిగే మనసున్న చాలున్
ఎందెందు వెదకున కనబడు
ప్రేమను మరచి ఇంకా యేల
ఈ తిరుగులాటల్ తీవ్రవాదముల్
ప్రేమించగలిగే మనసున్న చాలున్
ఎందెందు వెదకున కనబడు
ప్రేమను మరచి ఇంకా యేల
ఈ తిరుగులాటల్ తీవ్రవాదముల్
Comments
Post a Comment