గమనం ...


వంశీ కలుగోట్ల // గమనం ... //
******************************
ఆగిపోయిన చోటునుంచే
            మొదలవ్వాలనే ప్రయత్నం
అవునూ ఇంతకీ ఎక్కడ ఆగిపోయాను?
మనిషితనం వదిలేసి
ఆధునికత్వం మొదలైనచోటా
ఎదగటం అంటే
ఎదుటివాడిని అణచేయటం
అని పాఠం నేర్చుకున్నచోటా
మనిషి అంటే మతం అని
అర్థం చెప్పుకున్న చోటా

అడుగడుగునా నన్ను నిలిపేసిన
గోతులు కనబడుతూనే ఉన్నాయి
అంటే పయనించిందంతా
            పతనం వైపేనా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

మా ఊరి బస్సు ...