దేవుడు కావాలి

వంశీ కలుగోట్ల// దేవుడు కావాలి //
********************************
నేను నీతిగా, నిజాయితీగా ఎలా ఉండగలను
అవసరాన్ని బట్టి అలా మారుతుంటాను
నేను కేవలం మానవ మాత్రుడిని కదా 

కానీ అలా మారని వాడు ఒకడు కావాలి
సామాజిక బాధ్యతలతో నాకు సంబంధం లేదు
సామాజిక హక్కులు మాత్రం సాధించుకోవాలి
కానీ ఆ బాధ్యతలు నేరవేర్చేవాడొకడు కావాలి 

నేను చెయ్యలేనివి చెయ్యటానికి; మహాత్ముడి
లక్షణాలతో, మామూలు మనిషిలా కాకుండా
సమాజం కోసం, ప్రజల కోసం సర్వస్వం త్యాగం
చేసి పోరాడగలిగే మనిషి ఒకడు కావాలి 

కావాలంటే వాడికి దండేసి దణ్ణం పెడతాం
వీధులకు పేరు పెడతాం, దేవుణ్ణి చేసి పూజిస్తాం
ఇదంతా భావుకత్వమో, బలిసిన తత్వమో కాదు
దేవుడు కాలేని మనిషి మనసు ఘోష మాత్రమే

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...