మరుపు ఓ శాపం ...
వంశీ కలుగోట్ల// మరుపు ఓ శాపం ... //
************************************
మానని గాయాలు
చెరిగిపోని మోసాలు
కోల్పోయిన జీవితాలు
మరిచిపోయి
కాసింత మందు పోసి
బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి
నాలుగు నోట్లు చేతిలో పెట్టగానే
జై కొడుతున్నాడు
కాదు అది ఒక శాపం అని
ఋజువు చెయ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు
************************************
అనగనగా కథలో పాత్రలా
గమ్యం తెలియని బాటసారిలా
బ్రతుకుతున్నాడు వాడు
గమ్యం తెలియని బాటసారిలా
బ్రతుకుతున్నాడు వాడు
నిలువుదోపిడీ చేసిన నాయకుడు
గోచీబట్ట ఇస్తానంటే సంబరపడిపోతున్నాడు
గోచీబట్ట ఇస్తానంటే సంబరపడిపోతున్నాడు
నడిసంద్రంలో వదిలేసి
కుక్కతోక పట్టుకుని ఈదమని చెప్పే నేతని
నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు
కుక్కతోక పట్టుకుని ఈదమని చెప్పే నేతని
నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు
మానని గాయాలు
చెరిగిపోని మోసాలు
కోల్పోయిన జీవితాలు
మరిచిపోయి
కాసింత మందు పోసి
బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి
నాలుగు నోట్లు చేతిలో పెట్టగానే
జై కొడుతున్నాడు
ఎన్నికలొచ్చిన ప్రతిసారి
కులమో, మతమో, ప్రాంతమో
ఏదో ఒకటి చెప్పి ఉసిగొల్పి
ఉస్కో అనేవాడికి దాసోహం అంటున్నాడు
ఉస్కో అన్నోడి చేతిలోనే కళ్ళేలు ఉన్నాయని
చెర్నాకోల దెబ్బలు తన వీపుకేనని తెలిసీ
అమ్ముడుపోవడం
అలవాటైపోయిన సామాన్యుడు
మరుపు ఓ వరం అనుకునే సమాజానికి కులమో, మతమో, ప్రాంతమో
ఏదో ఒకటి చెప్పి ఉసిగొల్పి
ఉస్కో అనేవాడికి దాసోహం అంటున్నాడు
ఉస్కో అన్నోడి చేతిలోనే కళ్ళేలు ఉన్నాయని
చెర్నాకోల దెబ్బలు తన వీపుకేనని తెలిసీ
అమ్ముడుపోవడం
అలవాటైపోయిన సామాన్యుడు
కాదు అది ఒక శాపం అని
ఋజువు చెయ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు
Comments
Post a Comment