మార్పు ...
మార్పు ...
************
ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్న
మహాత్ములారా
రండి ... గోడమీదకి ఎక్కండి
రాతలు రాస్తారో
గీతలు గీస్తారో
కేకలు పెడతారో
అంతా మీ ఇష్టం
మార్పును అశిస్తూ
కొత్తను కోరుకుంటూ
ముఖపుస్తకపు గోడ మీద
రాసే రాతలకు
లైకులు కొట్టే వారి లెక్క
వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య
చూస్తే తెలుస్తుంది కదా
మారుతున్న వారి తీరు
ఏంటో ఈ ముఖ పుస్తకపు రోజుల్లో
మార్పు సాధించడం
చాలా సులువైపోతోంది
సాంకేతికత సాధించిన ప్రగతికి
మురిసిపోతూ
మార్పును గోడమీద చూసుకుని
పొంగిపోదాం ...
************
ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్న
మహాత్ములారా
రండి ... గోడమీదకి ఎక్కండి
రాతలు రాస్తారో
గీతలు గీస్తారో
కేకలు పెడతారో
అంతా మీ ఇష్టం
మార్పును అశిస్తూ
కొత్తను కోరుకుంటూ
ముఖపుస్తకపు గోడ మీద
రాసే రాతలకు
లైకులు కొట్టే వారి లెక్క
వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య
చూస్తే తెలుస్తుంది కదా
మారుతున్న వారి తీరు
ఏంటో ఈ ముఖ పుస్తకపు రోజుల్లో
మార్పు సాధించడం
చాలా సులువైపోతోంది
సాంకేతికత సాధించిన ప్రగతికి
మురిసిపోతూ
మార్పును గోడమీద చూసుకుని
పొంగిపోదాం ...
Comments
Post a Comment