కాల గమనం ...

వంశీ కలుగోట్ల // కాల గమనం ... //
***********************************
రాజసూయ యాగాల నాడే
రాజ్యకాంక్ష ఆపబడి ఉంటే
ఈనాటి చరిత్ర పుస్తకాల్లో
యుద్ధాలు ఉండేవి కావేమో

జగజ్జేత కావాలన్న
అలెగ్జాండర్ కోరిక
ఆనాడు ఆదిలోనే ఆపబడి ఉంటే
ఈనాడు అగ్ర రాజ్యాలు
యుధ్ధవిమాన మోతలు ఉండేవి కావేమో

అణుబాంబుల కాలంలో కూడా
ఆయుధం పట్టకుండా యుద్ధం చెయ్యొచ్చని
రక్తం చిందకుండానే విప్లవం లేవదీయోచ్చని
సహనం ఉంటే విజయం సాధించొచ్చని
గాంధీలు, మండేలాలు
రుజువు చేసి ఉండకపోతే
శాంతికి ఇంత విలువ ఉండేది కాదేమో

ఆధునిక కాలంలో కూడా
మాట మంత్రం కాగలదని
మహాసైన్యాన్ని నడిపించగలదని
సుభాష్ బోసు లాంటివారు చూపించకకపోయినట్టైతే
మౌనం మన భాష అయ్యేదేమో

అందాన్ని పొగడ్డమే కాదు
అక్షరం విప్లవం కూడా పుట్టించగలదని 
ఆయుధం కన్నా పదునైందని
కవులు, రచయితలూ
చూపకపోయినట్లయితే
రాజ్యం సృష్టించిన
అంధకారంలో ఉండిపోయేవారమేమో

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...