దేవుడేం చెయ్యగలడులే

వంశీ కలుగోట్ల// దేవుడేం చెయ్యగలడులే//
*****************************************
అయినా
దేవుడేం చెయ్యగలడులే
దూతనని చెప్పుకునేవాడు
సుఖాలు అనుభవిస్తూ
దందాలు నడుపుతూ
ఐశ్వర్యాలు దండుకుంటుంటే

భక్తుడిననేవాడు
కానుకలిచ్చి
తప్పులన్నీ చేసేసి
చేతులెత్తి దండాలు పెడుతుంటే

తలరాతలు రాసి
ఖర్మానికి వదిలేసిన మానవజాతి
తాడిచెట్టులాగా ఎదిగి
తన్నుకు చావటం చూసి

ఇంకోడెవడో వచ్చి
తనదో కొత్త మతమని
తానే  దేవుడినని చెప్పుకుని
విగ్రహం పెట్టుకున్నా 
దేవుడేం చెయ్యగలడు 

అన్నిటినీ చూస్తూ
ప్రార్థనాలయాల్లో బందీ అయి
'వినాశకాలే విపరీతబుద్ది' అని సరిపెట్టుకుని
సర్దుకుపోక
దేవుడేం చెయ్యగలడు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...