వీళ్ళింతే ...

వీళ్ళింతే ...  
***********
1
తనవాదమేదో తనకే అర్థం కాక  
అటువైపో ఇటువైపో 
దూకటానికి సిద్ధంగా  ఉన్న
గోడమీద పిల్లి లాంటి పెద్దమనిషి  
బాటమీద వెళుతున్న 
నన్ను ఏ వాదమంటూ ప్రశ్నించాడు
2
నా ఇంటికి గోడకు వేలాడుతున్న 
పులి బొమ్మను చూపి 
నా వంశం అంతా హింసావాదమేనన్నాడు 
కళ్ళున్న కబోది మూర్ఖుడు ఒకడు
3
ఓటు మాత్రమే వేస్తూ
ఉన్నన్నాళ్ళు
నన్నెవరూ పట్టించుకోలేదు
నేనెవరో అడగలేదు
ఇపుడు
నేను ప్రశ్నించటం మొదలెడితే
నాదే ప్రాంతమో
నేనే మతమో
నాదే వాదమో
నా చొక్కా రంగేమిటో
నేనే పార్టీ జెండా మోసానో
కూపీలు లాగుతున్నారు

Comments

Post a Comment

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...