జాగ్రత్త

జాగ్రత్త
********

దారి వెంట వెళుతుంటే
ఒక కుక్క మొరిగింది
బహుశా అది దాని పలకరింపేమో తెలీదు
నేను మాత్రం అది ఎక్కడ కరవడానికోస్తుందో అని
చిన్న కర్ర తీసుకుని సిద్ధంగా ఉన్నాను

సాయంకాలమైంది
ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు
దీపం, అగ్గిపెట్టె దగ్గర పెట్టుకుని సిద్ధంగా ఉన్నాను
వానొస్తే గొడుగు, చలేస్తే రగ్గు, ఎండకు ఫ్యాన్
ఇలా ప్రతి కాలానికి, ప్రకృతి ప్రకోపాలను
తట్టుకోవడానికి సిద్దగా ఉంటాను కానీ
దీనమ్మా జీవితం, అయిదేళ్లకోసారి వచ్చే
ఎన్నికలప్పుడు
మాత్రం జాగర్తగా ఉండలేకపోతున్నాను

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...