స్వాప్నికుడు

స్వాప్నికుడు
*************
మిత్రమా
స్వర్గం ఎక్కడో లేదు
ప్రయత్నిస్తే ... శ్రమిస్తే
మన కాళ్ళ దగ్గరకొస్తుంది
మన తలపై ఉన్నది
అనంత శూన్య ఆకాశం మాత్రమే
మిత్రమా
దేశాలు, సరిహద్దులు లేకపోతె
మతాలూ, మారణహోమాలు ఉండకపోతే
కులాలు, వర్గాలు సమసిపోతే
శాంతి పరిఢవిల్లుతుంటే
మీరంతా అంటారేమో
నేనొక స్వాప్నికుడినని
బాధలు, ఆకలిచావులు
ఆస్తుల గొడవలు లేకుండా
సోదరభావంతో అందరూ
ప్రపంచమంతా ఒక్కటిగా ...ఇది సాధ్యమా
మీరంతా అంటారేమో
నేనోక స్వాప్నికుడినని
కానీ నేనొక్కడిని కాదు
నాకు నమ్మకం ఉంది
మీరంతా నాతొ కలుస్తారు
ఏదో ఒకరోజు
ప్రపంచమంతా ఒక్కటిగా జీవిస్తుంది
(జాన్ లెన్నన్ 'ఇమాజిన్' కు స్వేచ్చానువాదం)

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...