శివుడయ్యేది ఎప్పుడురా? ...
శివుడయ్యేది ఎప్పుడురా? ...
******************************
సాగర మధనంలో పుట్టిన హాలాహలం
హరించిన హరుడిననుకున్నావా
మౌనంగా ఉంటె ముని అంటారనుకున్నావా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
గుడిలో బొమ్మలకి, గూట్లో చిలకలకి
కష్టం తీర్చమని వేడుకోలులెందుకురా
మౌనం వీడి నువ్వు మార్గం పట్టేదేప్పుడురా
నరుడా, నువ్వు శివుడయ్యేది ఎప్పుడురా?
******************************
సాగర మధనంలో పుట్టిన హాలాహలం
హరించిన హరుడిననుకున్నావా
మౌనంగా ఉంటె ముని అంటారనుకున్నావా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
అయిదేళ్లకోసారి దండాలు పెడుతున్నారని
నువ్వు దేవుడి ననుకుంటున్నావురా
పంచవర్ష ప్రణాళికలో పావువిరా నువ్వు
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
నువ్వు దేవుడి ననుకుంటున్నావురా
పంచవర్ష ప్రణాళికలో పావువిరా నువ్వు
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
గతితప్పిన మతం, సృష్టించిన మాయని
కార్చిచ్చై కాల్చేసి మసిబార్చేస్తుంటే
తిక్కని తలకెత్తుకుని తైతక్కలాడతావా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
కార్చిచ్చై కాల్చేసి మసిబార్చేస్తుంటే
తిక్కని తలకెత్తుకుని తైతక్కలాడతావా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
బొక్కసాలు నింపుకునే కొడుకులని
అరచేతిలో స్వర్గం చూపే వెన్నుపోటుగాళ్ళని
ఎన్నాళ్ళు నీ గూని వీపుపై మోస్తావురా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
అరచేతిలో స్వర్గం చూపే వెన్నుపోటుగాళ్ళని
ఎన్నాళ్ళు నీ గూని వీపుపై మోస్తావురా
నరుడా, నరం నలిగిందా చేవ చచ్చిందా
కష్టం తీర్చమని వేడుకోలులెందుకురా
మౌనం వీడి నువ్వు మార్గం పట్టేదేప్పుడురా
నరుడా, నువ్వు శివుడయ్యేది ఎప్పుడురా?
Comments
Post a Comment