అద్దంలో అందగాళ్ళు
వంశీ కలుగోట్ల// అద్దంలో అందగాళ్ళు //
***********************************
ఉదయం నిద్దుర లేచి
తాజాగా స్నానించి
అద్దంలో నన్ను నేను చూసుకున్నాను
ఎంత అందంగా ఉన్నానో
నా కళ్ళల్లో ధైర్యం, నమ్మకం
ప్రతిఫలిస్తున్నాయి
నేనెంత సాహసినో కదా
అనుకున్నాను
* * *
ఆ సాయంకాలం
చీకట్లు తరుముకోస్తుంటే
ఊరి బయట చెరువు గట్టుకు
వీడ్కోలు పలికి వెనుతిరిగాను
ఇంతలో ...
ఏవో ఆక్రందనలు
రక్షించమంటూ అరుపులు
ఎవరో మృగాల్లు చేతుల్లో కత్తులతో
ఆమెను బెదిరిస్తున్నారు
చెట్టు చాటున దాక్కుని
వలువలూదదీసుకున్న మానవత్వాన్ని
కోరికతో మృగమైన మానవుని
దాష్టీకాన్ని కళ్ళారా చూసాను
* * *
మళ్లీ
మరుసటి ఉదయం
అద్దంలో ... అందంగా నేను
ఆ రాత్రి
ఆమె అశక్తత
నా నిస్సహాయత
నన్ను వెంటాడుతూనే ఉన్నాయి
ఇప్పటికీ ...
* * *
నేనేనా ... నా లాగ ఎందరో
అద్దంలో అందగాళ్ళు
మేరునగధీరులు
***********************************
ఉదయం నిద్దుర లేచి
తాజాగా స్నానించి
అద్దంలో నన్ను నేను చూసుకున్నాను
ఎంత అందంగా ఉన్నానో
నా కళ్ళల్లో ధైర్యం, నమ్మకం
ప్రతిఫలిస్తున్నాయి
నేనెంత సాహసినో కదా
అనుకున్నాను
* * *
ఆ సాయంకాలం
చీకట్లు తరుముకోస్తుంటే
ఊరి బయట చెరువు గట్టుకు
వీడ్కోలు పలికి వెనుతిరిగాను
ఇంతలో ...
ఏవో ఆక్రందనలు
రక్షించమంటూ అరుపులు
ఎవరో మృగాల్లు చేతుల్లో కత్తులతో
ఆమెను బెదిరిస్తున్నారు
చెట్టు చాటున దాక్కుని
వలువలూదదీసుకున్న మానవత్వాన్ని
కోరికతో మృగమైన మానవుని
దాష్టీకాన్ని కళ్ళారా చూసాను
* * *
మళ్లీ
మరుసటి ఉదయం
అద్దంలో ... అందంగా నేను
ఆ రాత్రి
ఆమె అశక్తత
నా నిస్సహాయత
నన్ను వెంటాడుతూనే ఉన్నాయి
ఇప్పటికీ ...
* * *
నేనేనా ... నా లాగ ఎందరో
అద్దంలో అందగాళ్ళు
మేరునగధీరులు
Comments
Post a Comment