స్పందన ...
వంశీ కలుగోట్ల // స్పందన ...//
***********************
ఉరితాడు కొనే స్థోమత లేక
పంట కోసమని కొన్న పురుగుల మందు
కనీసం
ప్రాణాలు తీసుకోవటానికి పనికొచ్చిందనే
చిన్నపాటి తృప్తి కనబడుతోంది
జీవం పోయిన ఆ కళ్ళలో
***********************
ఉరితాడు కొనే స్థోమత లేక
పంట కోసమని కొన్న పురుగుల మందు
కనీసం
ప్రాణాలు తీసుకోవటానికి పనికొచ్చిందనే
చిన్నపాటి తృప్తి కనబడుతోంది
జీవం పోయిన ఆ కళ్ళలో
పర్రలు చీలిన పొలం దాహార్తిని తీర్చలేక
కన్నీటి తడి పొలానికి చేరలేదని
దేహంలో ఇంకా యే మూలైనా
స్వేదపు తడి మిగిలుంటే అది తీసుకుని
తరువాతి తరాల ఆకలి తీర్చగలదేమో ఆ పొలం
అనే ఆశతో
మట్టిలో కలిసిపోతున్నాయి ఆ జీవితాలు
కన్నీటి తడి పొలానికి చేరలేదని
దేహంలో ఇంకా యే మూలైనా
స్వేదపు తడి మిగిలుంటే అది తీసుకుని
తరువాతి తరాల ఆకలి తీర్చగలదేమో ఆ పొలం
అనే ఆశతో
మట్టిలో కలిసిపోతున్నాయి ఆ జీవితాలు
నాయకుడా తెలుసుకో ...
ఇవ్వాళ జాతికి కావలసింది
విదేశీ కంపెనీలకు పంట పొలాలు
ధారాదత్తం చేసి
పల్లెను పట్నం చెయ్యటం కాదు
రైతును ఆదుకుని
ఆ భూమిలో పంట పండించేలా భరోసానివ్వడం
ఇవ్వాళ జాతికి కావలసింది
విదేశీ కంపెనీలకు పంట పొలాలు
ధారాదత్తం చేసి
పల్లెను పట్నం చెయ్యటం కాదు
రైతును ఆదుకుని
ఆ భూమిలో పంట పండించేలా భరోసానివ్వడం
గుర్తుంచుకో
ముగిసిపోతున్న జీవితాలకు
వెలకట్టడం మానేసి
ఆగిపోతున్న ఆ గుండెలను
ఇప్పుడు కాపాడకపోతే
ఏదో ఒకరోజు
నోటికంటే ముద్ద దొరకక
మాడి చస్తావు
ముగిసిపోతున్న జీవితాలకు
వెలకట్టడం మానేసి
ఆగిపోతున్న ఆ గుండెలను
ఇప్పుడు కాపాడకపోతే
ఏదో ఒకరోజు
నోటికంటే ముద్ద దొరకక
మాడి చస్తావు
నువ్విప్పుడు స్పందించకపోతే
రేపు నీ చావుకు
స్పందించే దిక్కు కూడా ఉండదు
Comments
Post a Comment