మరకలు
మరకలు
********
ఎర్రబారిన కళ్ళు రసాస్వాదన ********
గుర్తు అనుకుంటున్నారు
నీ విరహంతో జ్వలిస్తోన్న
హృదయానికి సంకేతాలని తెలీక
* * *
నింగిన మెరిసే తారకలు
ఎన్ని భగ్న ప్రేమికుల కథలో
* * *
పాట పాడుకుందామని తోట కెళితే
రాలిన పువ్వు గాయాన్ని రేపింది
* * *
నీ ప్రేమ నాలో
పాట పుట్టిస్తుందనుకుంటే
మంట రేపింది
* * *
నువ్వు చేసిన గాయం
గేయాన్ని పుట్టిస్తుందనుకున్నా
కానీ నిస్తేజితుడిని చేసి
నిప్పుల గుండంలో పడేసింది
* * *
ప్రేమ విఫలమైతేనే
మత్తులోన జోగుతారు అనుకుంటారు
ప్రేమ ఎక్కువైనా
మనసు మత్తువైపు మళ్ళుతుందని తెలీక
* * *
Comments
Post a Comment