అనుకుంటాం కానీ ...

వంశీ కలుగోట్ల // అనుకుంటాం కానీ ... //
*************************************
విజయం సాధించటానికి
యుద్ధం చెయ్యాలని అనుకుంటాం కానీ ...
ఆ అవసరమే లేదని
గోబెల్స్ సృష్టించిన ఆధునిక
ప్రపంచం నేర్పింది


పోరాటానికి ఆయుధం
అవసరం అనుకుంటాం కానీ ...
అక్కర్లేదని పిల్లాడు సాధించుకున్న బొమ్మ
నాకో నిజాన్ని చెప్పింది 

అద్భుతాలు చెయ్యటం
దేవుడికే సాధ్యం అనుకుంటాం కానీ
ఆర్తుల మొహంపై చిరునవ్వు అనే అద్భుతాన్ని
సాధించిన మనీషిని చూసినపుడు
నేను కూడా ...
అద్భుతాలు సాధించగలనని తెలిసింది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...