అసంపూర్ణ కవిత ...
వంశీ కలుగోట్ల// అసంపూర్ణ కవిత ...//
************************************
ఎదురుగా కంప్యూటర్ తెరపై
కదులుతున్న అక్షరాలు
కుర్చీలోంచి కదలకుండా పనిచేస్తూ
కూపస్థమండూకంలా తయారైన
నన్ను చూసి నవ్వుతున్నాయి
******************************
ఎదురుగా కంప్యూటర్ తెరపై
కదులుతున్న అక్షరాలు
కుర్చీలోంచి కదలకుండా పనిచేస్తూ
కూపస్థమండూకంలా తయారైన
నన్ను చూసి నవ్వుతున్నాయి
కరిగిపోతున్న ఖరీదైన కాలాన్ని
ఖాళీ కేపుచినో కప్పులతో
లెక్కబెట్టుకుంటున్న నన్ను చూసి
సాయంకాలం ఇంటికెళ్ళాల్సిందేనంటూ
ఆపిల్ గడియారం అలారం కొట్టింది
ఖాళీ కేపుచినో కప్పులతో
లెక్కబెట్టుకుంటున్న నన్ను చూసి
సాయంకాలం ఇంటికెళ్ళాల్సిందేనంటూ
ఆపిల్ గడియారం అలారం కొట్టింది
పగటికి రాత్రికి తేడా తెలియని పనిలో
కోల్పోయిన కుటుంబ క్షణాలను
విదేశీ అవకాశం పూడుస్తుందనే ఆశతో
సూర్యుడిని చూడటం మర్చిపోయిన
ఆధునికుడిగా నన్ను చూసి
నక్షత్రాలు అమావాస్యని కప్పుకున్నాయి
కోల్పోయిన కుటుంబ క్షణాలను
విదేశీ అవకాశం పూడుస్తుందనే ఆశతో
సూర్యుడిని చూడటం మర్చిపోయిన
ఆధునికుడిగా నన్ను చూసి
నక్షత్రాలు అమావాస్యని కప్పుకున్నాయి
అంతరంగంలో ఉప్పెనలా ఎగిసే
అంతులేని భావ సంచలనాలకి
అక్షరాలు దొరక్క ఆగిపోయిన
అసంపూర్ణ కవితలా
జీవితం కోసం వెతుకుతూ
గమ్యం తెలియని పయనం చేస్తూన్న
నేనూ అసంపూర్ణుడినే
అంతులేని భావ సంచలనాలకి
అక్షరాలు దొరక్క ఆగిపోయిన
అసంపూర్ణ కవితలా
జీవితం కోసం వెతుకుతూ
గమ్యం తెలియని పయనం చేస్తూన్న
నేనూ అసంపూర్ణుడినే
Comments
Post a Comment