పాఠాలు ...
వంశీ కలుగోట్ల // పాఠాలు ...//
**************************
అనగనగా ఓ రోజు
చిన్ననాటి మిత్రుడొచ్చాడు
మేడ మీద కూర్చున్నాం
చిన్ననాటి స్మృతులు నెమరేసుకున్నాం
అది అమావాస్యనుకుంటాను
వెన్నెల కాంతులు లేవు
కొవ్వొత్తి వెలిగించి కూర్చున్నాం
పేకాట అయిపొయింది
మా ఇంట్లో గొడవలు
వాళ్ళింట్లో సమస్యలు
అయిపోయాయి
ఆది మానవుడి నుండి
ఆధునిక కవిత్వం దాకా
పాకిస్తాన్ నుండి
పక్కింటి గొడవ దాకా
సవివరంగా సహేతుకంగా
తెలివితేటలు ప్రదర్శిస్తూ
మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం
... అలసిపోయాం
అప్పుడు చూసాను కొవ్వొత్తి వంక
చివరి కాంతులు వెదజల్లుతూ
ఓ సారి నా వేపు చూసి
చీకట్లలో కలిసిపోతూ ఫక్కున నవ్వింది
చెంప చెళ్ళుమనిపించినట్టనిపించింది
**************************
అనగనగా ఓ రోజు
చిన్ననాటి మిత్రుడొచ్చాడు
మేడ మీద కూర్చున్నాం
చిన్ననాటి స్మృతులు నెమరేసుకున్నాం
అది అమావాస్యనుకుంటాను
వెన్నెల కాంతులు లేవు
కొవ్వొత్తి వెలిగించి కూర్చున్నాం
పేకాట అయిపొయింది
మా ఇంట్లో గొడవలు
వాళ్ళింట్లో సమస్యలు
అయిపోయాయి
ఆది మానవుడి నుండి
ఆధునిక కవిత్వం దాకా
పాకిస్తాన్ నుండి
పక్కింటి గొడవ దాకా
సవివరంగా సహేతుకంగా
తెలివితేటలు ప్రదర్శిస్తూ
మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం
... అలసిపోయాం
అప్పుడు చూసాను కొవ్వొత్తి వంక
చివరి కాంతులు వెదజల్లుతూ
ఓ సారి నా వేపు చూసి
చీకట్లలో కలిసిపోతూ ఫక్కున నవ్వింది
చెంప చెళ్ళుమనిపించినట్టనిపించింది
Comments
Post a Comment