నిరీక్షణ
వంశీ కలుగోట్ల // నిరీక్షణ... //
**************************
ప్రతి ఎన్నికలకీ
వేలి మీద ఇంకు గుర్తు చూసుకొని
ఏదో సాధించినట్టు
గర్వంతో పొంగిపోయే సామాన్యుడిలా
కథలూ, కవితలూ
రాసుకునే నేను కూడా అంతే
అల్పసంతోషం అన్నది
మాకిద్దరికీ అలవాటైపోయింది
ఎవరో ఒకరు వచ్చి
ఏదో ఉద్దరిస్తారని వోటేసేవాడు
సామాన్యుడు ఎప్పటికైనా
మారతాడని ఎదురుచూస్తూ నేను
నిరీక్షణ
మాకు అలవాటైపోయింది తరాలుగా
**************************
ప్రతి ఎన్నికలకీ
వేలి మీద ఇంకు గుర్తు చూసుకొని
ఏదో సాధించినట్టు
గర్వంతో పొంగిపోయే సామాన్యుడిలా
కథలూ, కవితలూ
రాసుకునే నేను కూడా అంతే
అల్పసంతోషం అన్నది
మాకిద్దరికీ అలవాటైపోయింది
ఎవరో ఒకరు వచ్చి
ఏదో ఉద్దరిస్తారని వోటేసేవాడు
సామాన్యుడు ఎప్పటికైనా
మారతాడని ఎదురుచూస్తూ నేను
నిరీక్షణ
మాకు అలవాటైపోయింది తరాలుగా
Comments
Post a Comment