బహుమతి అంతరంగం ...

వంశీ కలుగోట్ల// బహుమతి అంతరంగం ... //
********************************************
ఇన్నాళ్ళూ సహవాసం చేసి
ఇప్పుడు ఎవరో, ఎక్కడో ఏదో చేశారని
నన్ను వదిలేస్తానంటావా
మధ్యలో నేనేం చేసానని?
ఎక్కడో ఎవరినో ఎవరో ఏదో చేస్తే
ఎవరో ఇంకెవరినో చంపేస్తే
దానికి నాదెలా అవుతుంది బాధ్యత

నీ ఇంటికి నేనొచ్చినప్పుడు
ఎంత ప్రేమగా చూసుకున్నావు
నీ సహజ ప్రతిభకు
శోభనిచ్చానని మురిసిపోయావే
గుర్తింపు వచ్చిందని గర్వపడ్డావే
ఇప్పుడు నేనేమైనా
మకిలి అంటించానా
లేక మసి పూశానా
నా మీదేందుకు నీ పేద కోపం?
అక్షరం నీ అయుధమన్నావే
వాడటం మరచిపోయావా
ముసుగేసి మూలాన కూచోబెట్టావా లేక
నీ మెదడుకు వృద్ధాప్యం వచ్చిందా
ఉరిమి ఉరిమి నా మీద పడుతున్నావ్

నాకే  ఇజమూ లేదనుకున్నావా
నాకే హక్కులూ లేవా
చిత్తానికి వాడుకుని వదిలెయ్యటానికి
మనదేమైనా చీకటి భాగోతమనుకున్నావా
నీ విద్వత్తును మెచ్చి
ఇవ్వబడ్డ బహుమతిని నేను

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...