... పోరాటం

వంశీ కలుగోట్ల // ... పోరాటం //
***************************
కిరణాలు ఆగిపోతే 
దీపాలు వెలిగించే మనం
యోధుడు పడిపోతే 
యుద్ధం ఆపేస్తాం

పోరాడే యోధులు కూడా 
మామూలు మనుషులే
మరణానికి అతీతులు కారు 

గళమెత్తి పోరాడితే 
గొంతు కోసే సమాజం ఇదని
ముందుండి నడిపిద్దామని అనుకుంటే
వెనకున్నజనం వెన్నుచూపుతారని
నిజాలు తెలియని జీవితాలు 
స్మృతి స్థూపాల మీద 
పేర్లుగా చెక్కబడతాయి 

ఒక యోధుడో/నాయకుడో 
నిష్క్రమించినపుడు 
కావాల్సింది
కొవ్వొత్తులతో సంతాపాలు
పోరాటానికి 
విరామాలు కాదు 

పోరాటం అంటే 
నాయకుడు ముందుండి చేసేది కాదు 
సేనలు గెలిపించేది

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...