మహాత్ములు మారిపోతున్నారు
వంశీ కలుగోట్ల // ... మహాత్ములు మారిపోతున్నారు //
************************************************
మనుషులు పుడుతుంటారు, పోతుంటారు
మహాత్ములు మాత్రమే ఎప్పుడో ఒకసారి పుట్టి
గతిని మార్చి గుర్తును మిగులుస్తుంటారు
******************************
మనుషులు పుడుతుంటారు, పోతుంటారు
మహాత్ములు మాత్రమే ఎప్పుడో ఒకసారి పుట్టి
గతిని మార్చి గుర్తును మిగులుస్తుంటారు
ప్రజాస్వామ్య దేశంలో
ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికలకూ
ఒక్కొక్క మహాత్ముడు పుట్టుకోస్తున్నాడు
ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికలకూ
ఒక్కొక్క మహాత్ముడు పుట్టుకోస్తున్నాడు
ప్రచార సభలో జనసందోహాన్ని చూసి
ఒళ్ళు మరచిన 'అయిదేళ్ళ' మహాత్ములకు
మాటలకు చేతలకు తేడా తెలియని మైకం కమ్మిన ఊపులో
చేసే వాగ్దానాల ప్రవాహ ప్రభంజనం
ఓటేయ్యడానికి మాత్రమే పుట్టిన జనాలను ముంచేస్తోంది
ఒళ్ళు మరచిన 'అయిదేళ్ళ' మహాత్ములకు
మాటలకు చేతలకు తేడా తెలియని మైకం కమ్మిన ఊపులో
చేసే వాగ్దానాల ప్రవాహ ప్రభంజనం
ఓటేయ్యడానికి మాత్రమే పుట్టిన జనాలను ముంచేస్తోంది
కుర్చీనెక్కిన మహాత్ములకు
జేజేలు కొట్టే జనానికి, లెక్కలు చెప్పే అధికారులకు
తేడా తెలిసి మౌనం ఆవహించి ముని అయిపోతారు
గతం అంటే క్రితం ప్రభుత్వం మాత్రమే
గుర్తొస్తుంది తప్ప చేసిన వాగ్దానాలు కాదు
జేజేలు కొట్టే జనానికి, లెక్కలు చెప్పే అధికారులకు
తేడా తెలిసి మౌనం ఆవహించి ముని అయిపోతారు
గతం అంటే క్రితం ప్రభుత్వం మాత్రమే
గుర్తొస్తుంది తప్ప చేసిన వాగ్దానాలు కాదు
దేశం ఆవల
పరాయి గడ్డపై తన్నుకొచ్చే మాటకారితనం
ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఎగదన్నుకొచ్చే ఆవేశం
ఎన్నికలైపోయిన రాష్ట్రానికి వెళితే
ముసుగుతన్ని గమ్మున మూలనపడుంటాయి
మతిమరుపు ముంచుకొచ్చి
మాజీ ప్రభుత్వాలు మాత్రమే గుర్తుకువస్తాయి
ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఎగదన్నుకొచ్చే ఆవేశం
ఎన్నికలైపోయిన రాష్ట్రానికి వెళితే
ముసుగుతన్ని గమ్మున మూలనపడుంటాయి
మతిమరుపు ముంచుకొచ్చి
మాజీ ప్రభుత్వాలు మాత్రమే గుర్తుకువస్తాయి
మాజీలు చేసిన మోసాలకు ఒళ్ళు మండి
కొత్త మహాత్ముడికి పుట్టుకనిచ్చారని తెలిసీ
పాత గాయాన్ని మాత్రమే చూపుతూ కూచుంటే
అయిదేళ్ళ తరువాత ...
మళ్ళీ ఒక కొత్త మహాత్ముడు పుడతాడు
కొత్త మహాత్ముడికి పుట్టుకనిచ్చారని తెలిసీ
పాత గాయాన్ని మాత్రమే చూపుతూ కూచుంటే
అయిదేళ్ళ తరువాత ...
మళ్ళీ ఒక కొత్త మహాత్ముడు పుడతాడు
ఎందరో మహాత్ములను మాజీలను చేసిన
ప్రజాస్వామ్యంలో తాము శాశ్వతం కాదని
తెలుసుకోలేక ఈ మహాత్ములు మారిపోతున్నారు ...
ప్రజాస్వామ్యంలో తాము శాశ్వతం కాదని
తెలుసుకోలేక ఈ మహాత్ములు మారిపోతున్నారు ...
Comments
Post a Comment