నువ్వు - నేను
వంశీ కలుగోట్ల// నువ్వు - నేను //
******************************
కొత్త గాయంతో నేను
గాయం మిగిల్చిన మచ్చతో నువ్వు
ఇద్దరమూ ఒక్కటే
ఒకే నాణేనికి రెండు ముఖాలం
******************************
నాణేనికి రెండోవైపుందని
మరిచిపోయావా మిత్రమా ...
మరిచిపోయావా మిత్రమా ...
నేనేవాదినో
ఎవరి వాడినో
ముద్ర వేసే ముందు
నను విన్నావా
నా సమ్మతమడిగావా
ఎవరి వాడినో
ముద్ర వేసే ముందు
నను విన్నావా
నా సమ్మతమడిగావా
గాయాలు చూపి
నాది కాని గతమేదో చెప్పి
నన్నొక గాటన కట్టేసావు
నాది కాని గతమేదో చెప్పి
నన్నొక గాటన కట్టేసావు
కూలిన గోడలు చూపి
నేను లేనప్పుడు
నాది కాని భవనమెలా ఉండేదో
చెబుతున్నావు
నేను లేనప్పుడు
నాది కాని భవనమెలా ఉండేదో
చెబుతున్నావు
గాయాలు నీవి కావు
భవనం నాది కాదు
భవనం నాది కాదు
నీ కోసం
పోరు సలిపింది
అండ నిలిచింది
బాట వేసింది
బరువు మోసింది
ఒకనాటి నేనే కదా
పోరు సలిపింది
అండ నిలిచింది
బాట వేసింది
బరువు మోసింది
ఒకనాటి నేనే కదా
అక్షరం పట్టుకుని
నేనిక్కడ పోరాడుతుంటే
ఎందుకిలా
చరిత్ర లోంచి చెత్తను పీకి
నాకంటిస్తున్నావు
నేనిక్కడ పోరాడుతుంటే
ఎందుకిలా
చరిత్ర లోంచి చెత్తను పీకి
నాకంటిస్తున్నావు
నువ్వు చెబుతున్న
ఆ గతంలోని
నా భవనాలు పోయాయి
నీ పాత గాయాలు మానాయి
ఆ గతంలోని
నా భవనాలు పోయాయి
నీ పాత గాయాలు మానాయి
గాయం మిగిల్చిన మచ్చతో నువ్వు
ఇద్దరమూ ఒక్కటే
ఒకే నాణేనికి రెండు ముఖాలం
Comments
Post a Comment