ముసుగేసుకున్న సమాజం ...

వంశీ కలుగోట్ల// ముసుగేసుకున్న సమాజం ...//
*****************************************************
నిస్వార్థపరత్వం గురించి పాఠాలు చెబుతూ 
నిలువెల్లా స్వార్థం నింపుకున్న గురువిందలు 
మహనీయులుగా గుర్తింపబడుతున్న సమాజంలో 
మంచితనం అంటే తన ఎదుగుదలకి 
ఒక మెట్టుగా ఉపయోగపడే అవకాశంగా 
మలచుకోవడంలో నాయకుడు ముందుంటాడు

మతం, ధర్మం పేర బోధనలు చేస్తూ 
నమ్మకాన్ని వాడుకుంటున్న అవకాశవాదులు 
మహాత్ములుగా గుర్తింపబడుతున్న సమాజంలో 
మతం పట్ల, ధర్మం పట్ల నమ్మకాన్ని 
అమ్మకపు వస్తువుగా మార్చుకోవటానికి 
సర్వసంగపరిత్యాగులు కూడా వ్యాపారులవుతారు 

శవమైనా, శీలమైనా కులం తెలిసినతరువాతనే 
న్యాయం కోరతామనే మేధావులున్న సమాజంలో 
ఆడది అంగడిబొమ్మ సరుకులానే ఉంటుంది 
కేళిలో కులాలు పైకీ కిందకీ మారుతూనే ఉంటాయి 
మెధావిత్వపు మూర్ఖత్వాన్ని వాడుకోవడానికి 
రాజకీయాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...