... అలవాటే కదా

వంశీ కలుగోట్ల// ... అలవాటే కదా// 
**********************************
అరచేతిలో అధ్బుత స్వర్గం చూపిస్తా
అనే వాడిని నమ్మి అందలమెక్కిస్తావు
పొలం ఆవల అందమైన ప్రపంచం ఉంది అంటే
నమ్మి నీ భూమిని అప్పగిస్తావు
వ్యవసాయం దండగ అని ఎవడో ప్రవచిస్తే నమ్మి
బతుకును పట్నం బజారులో పడేసుకుంటావు
నీ కష్టాలను కడతేర్చటానికి వేరింకెవరికోసమో చూస్తావు
నమ్మి నట్టేట మునగటం నీకు అలవాటే కదా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...