వాడు నవ్వుతూనే ఉండాలి ...

వంశీ కలుగోట్ల// వాడు నవ్వుతూనే ఉండాలి ...//
******************************
****************
కొన్ని సంవత్సరాల క్రితం
నాదో, మరింకొకరిదో పుట్టినరోజునాడు
నేను విత్తు/మొక్క నాటుతుంటే
వాడు చూసి వెటకారంగా నవ్వాడు
నాది మూర్ఖత్వమన్నాడు

నేను నీరు పోయడానికెళ్ళిన ప్రతిసారి
వాడు నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు
మూర్ఖత్వమని వెక్కిరిస్తూనే ఉన్నాడు

సంవత్సరానికి ఒకసారి
ప్రతి పుట్టినరోజు నాడు నేను కనిపించినప్పుడు
నన్నూ ఆ మొక్కను చూసి
మళ్ళీ మళ్ళీ నవ్వుతూనే ఉన్నాడు
మొక్క మానవలేదని వెక్కిరిస్తూనే ఉన్నాడు 

ఈ రోజు, ఇన్ని సంవత్సరాల తరువాత
ఆ విత్తు మొక్క నుండి మాను (చెట్టు) అయింది
ఇప్పుడు కూడా వాడు నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు
కానీ, ఇప్పుడు వాడి నవ్వులో
నాకు వెటకారం కనిపించటం లేదు
ఆ నవ్వులో కృతజ్ఞత కనిపిస్తోంది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...