నువ్వొక కవచానివి ...
వంశీ కలుగోట్ల// నువ్వొక కవచానివి ... //
********************************* ***********
నువ్వంటే ఎవరో తెలుసా
నువ్వనుకునే నువ్వు నువ్వు కాదు
చేతికందిన రంగులన్నీ
అర్థం లేని ఆవేశంతో కాగితం మీద
నేను ఒలకబోసుకున్నప్పుడు
తయారయిన చిత్రానివి నువ్వు
నేను యుద్దానికి సిద్ధమైతే
నా ముందుండే సైన్యానివి నువ్వు
ఆవేశంతో నేను చెయ్యెత్తితే
ఆయుధమై చేరే రక్షణ నువ్వు
నేను బయటకెళ్ళేటప్పుడు
వేసుకునే ముసుగువి నువ్వు
నువ్వు చంద్రగుప్తుడు లాంటివాడివైతే
నేను చాణక్యుడిలాంటివాడిని
నువ్వు రాయలు లాంటివాడివైతే
నేను తిమ్మరుసులాంటోడిని
నువ్వు వజ్రాయుధం లాంటివాడివి
నిన్ను వాడే ఇంద్రుడిలాంటోడిని నేను
నువ్వనుకునే నువ్వు నువ్వు కాదు
నేను తయారు చేసినబొమ్మవి నువ్వు
మాట నీదైతే అర్థం నాది
నీ వెనుక నడిచేది నిన్ను నమ్మి కాదు
ఏమి జరిగినా నువ్వు ముందుంటావని
నువ్వు నాయకుడివి కాదు మా కవచానివి
Comments
Post a Comment