దిక్పాలకులు ...

వంశీ కలుగోట్ల// దిక్పాలకులు ... //
**********************************
తూరుపు దిక్కున - ఉన్నారు కొందరు అక్కడ
ప్రపంచం బాధని తమ బాధలా ఫీలయ్యే శ్రీ శ్రీ లాంటివారు
అక్షరాలు, ఆయుధాలు ఊతంగా తీసుకుని
తిమిరంపై సమరం చేసి
ప్రపంచానికి వెలుగును పంచాలనుకునే సూరీడు లాంటోల్లు 

పశ్చిమ దిక్కున - అక్కడ కొందరు ఉన్నారు
ఆశలను అవసరాల మేరకు అణచేసుకుని
ఉద్యోగాలు చేసుకుంటూ, వోట్లు వేసుకుంటూ
ఎవడొస్తే వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ
బతుక్కూ చావుకూ మధ్య దూరాన్ని
ప్రజాస్వామ్యపు స్వేచ్ఛతో కొలుస్తూ
చీకటివైపు లోకాన్ని తీసుకెళుతూ

ఉత్తరం దిక్కున - అక్కడ కొందరు ఉన్నారు
జీవితాన్ని, జీవించడాన్ని అనుభవిస్తూ
ఆనందాలని డబ్బుతో కొలుచుకుంటూ
ఉన్న సంపదని ఇంతలు ఇంతలుగా పెంచుకుంటూ
ప్రపంచాన్ని కిందకు తోసి తాము పైపైకి ఎదిగిపోతూ
 
దక్షిణ దిక్కున - అక్కడా కొందరు ఉన్నారు  
ప్రపంచానికీ తమకూ సంబంధమేంటో అర్థం కాని పరిస్థితుల్లో
తమను తామే హత్యించుకుంటూ
చరిత్రలో చెత్తని నింపుతూ
మార్చటానికి ఎవడో ఒకడొస్తాడని ఎదురుచూస్తూ

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...