పల్లెలను వదిలెయ్యండి ...

వంశీ కలుగోట్ల// పల్లెలను వదిలెయ్యండి ... //
********************************************
నగరం పేరు చెబితే  కొందరికి 
బహుశా అభివృద్ధి గుర్తుకు వస్తుందేమో
కానీ, ఆ అభివృద్ధి మాటున 
ఆ నగరం మింగేసిన పల్లెలు ఎన్నో 

పల్లెలంటే అమాయకత్వమే కాదు
పల్లెలంటే చదువులేని తనం కాదు
పల్లెలంటే పట్నాలను బతికించే ప్రాణవాయువులు
పల్లెలంటే నగరాలకు తిండి పెట్టే పొలాలు 

నచ్చకపోతే పల్లెలనుండి
మనుషులను వలస పోమ్మనండి
పల్లెలను పట్నాలను చెయ్యాలని మాత్రం
ప్రయత్నాలు చెయ్యడం ఆపండి 

మనుషులు లేకపోయినా పల్లెలు బతకగలవు
కానీ పల్లెలు, పచ్చదనాలు లేని రోజున
మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...