మరో కొత్త సంవత్సరం ...
వంశీ కలుగోట్ల// మరో కొత్త సంవత్సరం ... // ****************************** ************ కొత్తగా పథకాలు వేసుకోవడానికి పథికుడిగా మారడానికి నేనేమీ ఇన్నాళ్ళూ చేష్టలుడిగి, చైతన్యం కోల్పోయి అన్నీ మూసుకుని మూలాన కూచోలేదు అయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పథకాలు వేసి ఆచరించినా ప్రతి సంవత్సరం వయసు ఒక అంకె పెరుగుతూనే ఉంది నెత్తిమీది జుట్టు ఊడుతూనే ఉంది సంపాదించిన డబ్బు సరిపోవట్లేదు కొన్న వస్తువులు తృప్తినివ్వట్లేదు ... పాత అప్పులు తీరట్లేదు దీనమ్మా జీవితం ... పాత సంవత్సరం ఏమిచ్చిందో అర్థం కాక కొత్త సంవత్సరం ఏమి తెస్తుందో తెలీక ప్రతి సంవత్సరం చివరిరోజన నేను అనుభవించే వేదన ఎవరికి తెలుసు ఖాళీ అయిన విష్కి బాటిల్ కా కాలిపోయిన సిగరెట్టుకా మాటలు రాని కాలానికా అయినా ప్రతిసారీ అదే తంతు ... నా పథకాలు నేను వేసుకుంటూంటే సంవత్సరం/కాలం తనఇచ్చానికి తను చేస్తోంది అందుకే ఇక మీదట పథకాలు లేవ్ ఆచరణల్లేవ్ ... జో హోనేవాలా వో హోగా ... సోచ్ నా మత్, ఫికర్ నా మత్ జీయెంగె జిందగీ ... హర్ పల్, దిల్ భర్ ఇస్ సాల్ ... ఔర్ హర్ సాల్, జీయో మేరె లాల్ --- అందరికీ నూతన స...