పరాయివాడినే ...
వంశీ కలుగోట్ల// పరాయివాడినే ... //
**************************************
ఆశకు అధికారానికి మధ్యన నిలబడి
రక్తం చిందకూడదని రాజ్యం వదులుకున్న
రాముడిని చూపాను
ధర్మానికి రూపమని, మహానుభావుడని చెప్పి
దేవుడిని చేసి ఒక మతం గాటన కట్టేశారు
******************************
ఆశకు అధికారానికి మధ్యన నిలబడి
రక్తం చిందకూడదని రాజ్యం వదులుకున్న
రాముడిని చూపాను
ధర్మానికి రూపమని, మహానుభావుడని చెప్పి
దేవుడిని చేసి ఒక మతం గాటన కట్టేశారు
రక్తం చిందించి మానవత్వం నిలబెట్టాలని
ప్రయత్నించిన జీసస్ ని చూపాను
ఆ బోధనలు ఒక గ్రంథమని
ఆయనదో మతమని తీర్మానం చేసారు
ప్రయత్నించిన జీసస్ ని చూపాను
ఆ బోధనలు ఒక గ్రంథమని
ఆయనదో మతమని తీర్మానం చేసారు
జ్ఞానం కోసమని రాజ్యం వదులుకున్న గౌతముడు
నమ్మినదాని కోసం సర్వం త్యాగం చేసిన వర్ధమానుడు
విగ్రహాలను కాదంటూ నిగ్రహాన్ని బోధించిన ప్రవక్త
నమ్మినదాని కోసం సర్వం త్యాగం చేసిన వర్ధమానుడు
విగ్రహాలను కాదంటూ నిగ్రహాన్ని బోధించిన ప్రవక్త
ఎంతమందినని చరిత్ర లోంచి తీసి
ఈ మనుషులకు నిదర్సనంగా చూపాలి
చూపిన ప్రతి ఒక్కడినీ ఒక దేవుడిని చేసి
ఒక్కొక్కరిదీ ఒక మతమంటూ
చివరకు ప్రశ్నించటాన్ని కూడా ఒక మతం చేశారు
ఈ మనుషులకు నిదర్సనంగా చూపాలి
చూపిన ప్రతి ఒక్కడినీ ఒక దేవుడిని చేసి
ఒక్కొక్కరిదీ ఒక మతమంటూ
చివరకు ప్రశ్నించటాన్ని కూడా ఒక మతం చేశారు
ఒకప్పుడు మతం అంటే విశ్వాసం
ఇప్పుడు మతం అంటే మూర్ఖత్వం
విశ్వాసానికి విలువిచ్చి మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే
పరాయివాడంటే - ఏమో అవునేమో
ఇప్పుడు మతం అంటే మూర్ఖత్వం
విశ్వాసానికి విలువిచ్చి మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే
పరాయివాడంటే - ఏమో అవునేమో
Comments
Post a Comment