ఒక అసహనపు కల ...
వంశీ కలుగోట్ల// ఒక అసహనపు కల ... //
******************************************
******************************
ఒక్కో జెండాని నెత్తికెత్తుకుని
ప్రజల పక్షాన పోరాడుతున్నామంటూ
పార్టీలను భుజాన మోస్తూ
బాకా ఊదే పత్రికలన్నీ చదువుకుని
నా తీరున నాకు నచ్చినదేదో రాసేసుకుని
ఆ రోజుకు ఇక చాలని నిద్రించాను
* * *
"... అప్పుడు వ్యతిరేకించానని వాడు ఎవరూ కనబడక వెనుతిరిగారు
ఎందుకో తెలీదు
కలుగులోంచి రహస్య మార్గం గుండా
నేనొక్కడినీ బయటకొచ్చాను
కొత్తగా ఏదైనా రాయటానికి
ఎవరి వెతలనో ఏరుకుందామని కావచ్చు
కనిపించిన నన్ను చూసి
అసలు నేనెవరో కూడా తెలీకపోయినా
ఏ తలుపూ తెరుచుకోక దారివెంట పరిగెడుతూంటే
మూసుకుని ఉన్న ప్రతి తలుపు వెనుకా
నిస్సహాయతతో కూడిన భయం వినబడుతూనే ఉంది
నిస్సహాయతతో కూడిన భయం వినబడుతూనే ఉంది
అంగ అంగకూ ఆశలు వదిలేసుకుంటుంటే
ఒక తలుపు తెరుచుకుంది
ఒక తలుపు తెరుచుకుంది
తెరిచిందెవరో తెలీదు కానీ లోపల ఉన్నదంతా పిల్లలే
రేపటికోసం కలలుకంటూన్నవారే
ఇవ్వాళ్టికి తప్పించుకున్నానని సంబరపడుతూంటే
తలుపు బద్దలు కొట్టుకొచ్చిన ఒక మూర్ఖత్వం
నన్ను కాపాడటానికి ప్రయత్నించినందుకు
ఎవరో జాగ్రత్తగా దాచుకున్న
ఆ కలలను చిదిమేయాలని ప్రయత్నిస్తోంది
ఎవరో జాగ్రత్తగా దాచుకున్న
ఆ కలలను చిదిమేయాలని ప్రయత్నిస్తోంది
చిత్రంగా అంతవరకూ పారిపోవాలని
ప్రయత్నించిన నేను అప్పుడు ఎదురుతిరిగాను
పోరాడితే పోయేదేముంది" అనుకుంటూ
* * *
ఇంతలో ఎవరో తట్టినట్టు మెలకువ వచ్చింది
... అప్పుడు అర్థమైంది
... అప్పుడు అర్థమైంది
ఇంతవరకూ జరిగిందంతా కల అని
కల వల్ల పుట్టుకొచ్చిన అసహనపు భావన
కొద్దిసేపు నిద్దుర రాకుండా తొలిచేసింది
Comments
Post a Comment