నువ్వెవరో ...
వంశీ కలుగోట్ల // నువ్వెవరో ... //
********************************
నువ్వు రాతగాడివో
పాటగాడివో
ఆటగాడివో
పనివాడివో
పనికిమాలినోడివో
ఎవరైతేనేం
నువ్వు చేసేది ఏదైతేనేం
అది ఎంత బావుంటే మాత్రం
మెచ్చుకుని మాలలేసి
********************************
నువ్వు రాతగాడివో
పాటగాడివో
ఆటగాడివో
పనివాడివో
పనికిమాలినోడివో
ఎవరైతేనేం
నువ్వు చేసేది ఏదైతేనేం
అది ఎంత బావుంటే మాత్రం
మెచ్చుకుని మాలలేసి
వెన్ను తట్టి ప్రోత్సహించాలా
నీ గురించి మాట చెప్పాలా
నువ్వెవరో తెలుసుకోకపోతే ఎలా
నీ ముందూ వెనుకా ఎవరున్నారో
నీదే వర్గమో
నీవే వాదానికి ఊతమిస్తున్నావో
తెలీకుండా
తెలుసుకోకుండా
ఊరికినే పల్లకి మోయాలా
నీ గురించి మాట చెప్పాలా
నువ్వెవరో తెలుసుకోకపోతే ఎలా
నీ ముందూ వెనుకా ఎవరున్నారో
నీదే వర్గమో
నీవే వాదానికి ఊతమిస్తున్నావో
తెలీకుండా
తెలుసుకోకుండా
ఊరికినే పల్లకి మోయాలా
ముందు నువ్వెవరో చెప్పు
నిన్ను భుజాల మీద మొయ్యాలో
ఎత్తి కుదెయ్యాలో
ఆ తరువాత తేల్చుకుందాం
Comments
Post a Comment