ఓ కాలమా ...

వంశీ కలుగోట్ల// ఓ కాలమా ... //
*************************************
ఈ మేఘాల్ని తీసుకెళ్ళిపోతావేమో 
                    ... వర్షించకుండానే  
నా నిద్దురని చెరిపేస్తావేమో 
                    ... స్వప్నం పలకరించకముందే 

అని భయపడుతూనే ఉంటాను 
అందుకే ... ఓ కాలమా 
నిన్ను అందుకుందామని 
          ... పరుగులు పెడుతుంటాను 
కానీ, నువ్వేమో క్షణం ఆలస్యం చెయ్యకుండా 
          ... నిర్దాక్షిణ్యంగా కరిగిపోతావు 
నిన్నెలా నిక్షిప్తం చేసేది? 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...