నేనెవరంటే ...

వంశీ కలుగోట్ల// నేనెవరంటే ... //
********************************
నువ్వు విషాదంగా ఉన్నపుడు 
          నీకు దూరంగా ఉంటాను!
అంతర్మధనంలో 
నిన్ను నీవు తెలుసుకోవాలని 

నువ్వు ఆనందంగా ఉన్నపుడు 
          నీ దరికి రాను!
నీలో అది నిలిచిపోవాలని 

నువ్వు విజయాలు సాధిస్తే 
          ఆకాశానికెత్తేయను 
సాధించాల్సింది ఇంకా 
చాలా ఉందని గుర్తు చేస్తాను 

నువ్వు బాధల్లో ఉన్నపుడు 
          నేను ఓదార్చను!
అధిగమించే శక్తినిమ్మని ప్రార్థిస్తాను 

నువ్వు కిందపడితే 
          చేయందించి పైకి లేపను
నింగికెగసే దమ్ము ధైర్యం 
నీకుండాలని కోరుకుంటాను 

నువ్వు దూరంగా వెళతానంటే 
          నేను బాధపడను
జీవనపోరాటంలో
ముందుకెళుతున్నావని సంతోషిస్తాను 

నేనెవరని చెప్పమంటే
ఏ ముసుగు లేని 
స్నేహం అనే బంధాన్ని 
నీతో కలుపుకున్నోడిని 

(సందర్భం సరిగ్గా గుర్తులేదు కానీ 2004 వ సంవత్సరంలో రాసినది/రాసుకున్నది)

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...