కప్పు కాఫీ కోసం ...
వంశీ కలుగోట్ల// కప్పు కాఫీ కోసం ...//
***********************************
అరేయ్ కాఫీ ******************************
అక్కా, చెల్లీ, అమ్మా, నాన్నా
బావా, మామా ...
ప్రేమగా పిలిచే పిలుపేదైతేనేం
అందించే చెయ్యి వరసేదేతైనేం
కప్పు కాఫీ లోపల పడితే
ఆ కిక్కే వేరప్పా ...
తిరుణాల కెళ్ళినా
తీర్థయాత్రకెళ్ళినా
పక్కూరికెళ్ళినా
పెళ్ళైనా చావైనా
కాఫీలేని చోటేది
కప్పు కాఫీ
కడుపులోపల పడాల్సిందే
కడుపులోపల పడాల్సిందే
కప్పు కాఫీ కోసం
కులమూ
మతమూ
స్థలమూ
అన్నీ వదిలేసి
అందరిలో ఒకడినైపోయిన నేను
కాఫీ లోపల పడగానే
రాత్రంతా తొక్కిపెట్టిన
కల్మషాలను బయటపెట్టి
మనిషితోలు కప్పుకుని
మృగత్వాన్ని ప్రదర్శిస్తూ
మరో రోజును
ఆ విధంగా ముందుకు తీసుకుపోతూ
...
...
...
...
కప్పు కాఫీ కోసం అన్నీ
వదులుకోగలిగిన నేను
సాటి మనిషి కోసం
ఏదీ వదులుకోలేక
మరో కప్పు కాఫీ కోసం
రేపటి ఉదయానికై ఎదురు చూస్తూ ...
Comments
Post a Comment