నువ్వెక్కడున్నావు ...
వంశీ కలుగోట్ల// నువ్వెక్కడున్నావు ... //
*****************************************
నా జీవనదిలో నుండి
నా ఎడారిలో నుండి
నా గాలిలోనుండి
నేనెక్కడికి పోతాను?
నీదగ్గరకే వస్తానా ... నిజమేనా?
******************************
నా జీవనదిలో నుండి
నా ఎడారిలో నుండి
నా గాలిలోనుండి
నేనెక్కడికి పోతాను?
నీదగ్గరకే వస్తానా ... నిజమేనా?
అయితే మరి నువ్వెక్కడున్నావు
నాలోనే ఉన్నానంటావు
మరి నేను నీ దగ్గరకు రావడమెలా అవుతుంది?
అయితే అంతా అబద్దమా
కాదంటావు ...
నాలోనే ఉన్నానంటావు
మరి నేను నీ దగ్గరకు రావడమెలా అవుతుంది?
అయితే అంతా అబద్దమా
కాదంటావు ...
మరి నేనెక్కడకు పోతాను
నువ్వు చెప్పవు
నువ్వు చెప్పవు
నువ్వే నేనైతే ... నేనెందుకు నువ్వు కాదు
మరెందుకీ భేదాలు ...
నువ్వు, నేను ఒకటే అయినపుడు
నువ్వక్కడ (?) నేనిక్కడ ఎందుకు?
నేను భరించలేనా
నువ్వు భారం మొయ్యలేవా
మరెందుకీ భేదాలు ...
నువ్వు, నేను ఒకటే అయినపుడు
నువ్వక్కడ (?) నేనిక్కడ ఎందుకు?
నేను భరించలేనా
నువ్వు భారం మొయ్యలేవా
నువ్వెక్కడున్నావు?
చెప్పవు చెట్టులోనా ... పుట్టలోనా
రాతిలోనా ... మట్టిలోనా
నీరు, గాలి, నిప్పు, ఆకాశం ...
ఏదీ నీ సర్వాంతర్యామిత్వం
నాకు కనిపించవేమి?
చెప్పవు చెట్టులోనా ... పుట్టలోనా
రాతిలోనా ... మట్టిలోనా
నీరు, గాలి, నిప్పు, ఆకాశం ...
ఏదీ నీ సర్వాంతర్యామిత్వం
నాకు కనిపించవేమి?
ఓహో ...
భక్తితో నిన్ను ప్రార్థించాలా
నువ్వే దిక్కని ఏడవాలా ...
ఏం? ... ఎందుకంత పొగరు
భక్తితో నిన్ను ప్రార్థించాలా
నువ్వే దిక్కని ఏడవాలా ...
ఏం? ... ఎందుకంత పొగరు
జపం చెయ్యమంటావు
తపమాచరించమంటావు
పాడమంటావు
ఆడమంటావు
చంపమంటావు
చావమంటావు
అసలు ఏమి చెయ్యాలో నీకైనా తెలుసా
తపమాచరించమంటావు
పాడమంటావు
ఆడమంటావు
చంపమంటావు
చావమంటావు
అసలు ఏమి చెయ్యాలో నీకైనా తెలుసా
నువ్వెక్కడో దూరంగా ఉండి
తెలుసుకోమని దాగుడుమూతలాడతావు
తెలుసుకోమని దాగుడుమూతలాడతావు
బంధాలతో బంధనాలు వేస్తావు
తెంచుకుంటే చేరతానంటావు
ఏం ... ఎందుకు తెంచుకోవాలి
నువ్వేగా కల్పించింది (?)
నువ్వే తెంపెయ్యొచ్చుగా
ఊహూ ... అది చెయ్యవు
తెంచుకుంటే చేరతానంటావు
ఏం ... ఎందుకు తెంచుకోవాలి
నువ్వేగా కల్పించింది (?)
నువ్వే తెంపెయ్యొచ్చుగా
ఊహూ ... అది చెయ్యవు
అన్నీ చెబుతావు
ఒక్కోసారి ...అసలేమీ చెప్పవు
ఒక్కోసారి ...అసలేమీ చెప్పవు
ఏం ...
ఆడుకోవడానికి నీకింకేం దొరకలేదా
అయినా తప్పు మాదేలే
నిన్ను అలానే
మాతోనే ఉండనివ్వాల్సింది
అలా కాకుండా
నిన్ను మేమంతా కలిసి
దేవుణ్ణి చేశాం పూజలు చేస్తున్నాం ...
అందుకే అందకుండా పోయావు
ఆడుకుంటున్నావు
ఆడుకోవడానికి నీకింకేం దొరకలేదా
అయినా తప్పు మాదేలే
నిన్ను అలానే
మాతోనే ఉండనివ్వాల్సింది
అలా కాకుండా
నిన్ను మేమంతా కలిసి
దేవుణ్ణి చేశాం పూజలు చేస్తున్నాం ...
అందుకే అందకుండా పోయావు
ఆడుకుంటున్నావు
Comments
Post a Comment