స్వగతం ...

వంశీ కలుగోట్ల// స్వగతం ... //
******************************
నన్ను మళ్ళీ ప్రేమించలేవా
నా సర్వస్వం కోల్పోయి
నీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నాను
అప్పుడప్పుడు
నీ కోపం ఉధృతమై
ఉప్పెనలా ఊడ్చి పారేసినపుడు
నీ శోకం వరదై
ముంచేసి కూల్చేసినపుడు
చేష్టలుడిగి బిత్తరపోవడం తప్ప
నేనేం చేయగలిగాను

అవును, ఒప్పుకుంటున్నాను
 

ప్రకృతి లేదూ పర్యావరణం లేదూ అని తోసిపారేసింది నేనే
నీ కంటే సంపదలే ముఖ్యమని
 

డబ్బుంటే ఏదైనా సాధించొచ్చని అనుకున్నా  
కానీ ... నిన్ను కాపాడుకోకుంటే  
నాకు ఉనికి అనేదే ఉండదని  
ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది 
నీ ప్రేమని తప్ప
మరింక దేన్నీ తట్టుకోలేనని
నాకు అర్థం అయింది

ఓ ప్రకృతీ
... నా సర్వస్వం కోల్పోయి
నీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నాను
నన్ను మళ్ళీ ప్రేమించు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...