హృదయం క(వ్య)థ ...

వంశీ కలుగోట్ల// హృదయం క(వ్య)థ ...//
************************************************
ఈ హృదయాన్ని గురించి ఆలోచించినపుడు 
     ... నాకే చిత్రంగా అనిపిస్తుంది 

ఎన్ని దెబ్బలు తగిలినా 
సాటి హృదయాలెన్ని గాయాలు చేసినా 
తన భావజాలాన్ని 
తన ప్రేమభావాన్ని 
తన స్నేహతాపాన్ని 
ఈ హృదయం ... 
అణచుకోలేదెందుకని! 
అణగారిపోదెందుకని! 

అటు స్నేహించడమూ 
ఇటు ప్రేమించడమూ 
గాయాలు తగిలితే 
గేయాలతో స్వాంతన పొందడమూ 
బహుశా ... అలవాటైపోయిందేమో 

ఈ హృదయంలో ఇంకా 
ఎంత ప్రేముందో ... ఎంత స్నేహముందో 
తెలియడం లేదు 

అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది 
నా హృదయంలో కనుక 
ఇంత స్నేహమూ
ఇంత ప్రేమా లేకపోయుంటే 
తగిలిన గాయాల ధాటికి 
నేనెప్పుడో గేయమై గాలిలో 
కలిసిపోయే వాడినేమో అని 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...