లేచిన ప్రతిగొంతుకా ...
వంశీ కలుగోట్ల// లేచిన ప్రతిగొంతుకా ... //
***************************************
ప్రశ్నించే ప్రతివాడూ
... పడని వాడే
లేచిన ప్రతి గొంతుకా
... ప్రతిపక్షందే
... ప్రతిపక్షందే
అధికారంలో వేరేవాడున్నప్పుడు
నేను ప్రశ్నిస్తే
వెన్ను తట్టి అండగా నిలబడతానని
జనాన్నేసుకుని వచ్చాడు
నేనే మహాత్ముడినన్నాడు
రోజులు మారిపోయాయి
ప్రభుత్వాలూ మారిపోయాయి
కొత్తగా వచ్చినాయన దేవుడు లాంటోడు
పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడనుకున్నాం
అయినా దెయ్యత్వం అంటే
... లక్షణమే తప్ప వ్యక్తి కాదని
పాత/నిత్య సత్యం మళ్ళీ
కొత్తగా అనుభవంలోకి వచ్చింది
ఆనాడు అండగా నిలబడి
ప్రశ్నను ఉద్యమంగా మార్చిన వాడే
ఇప్పుడు ప్రశ్నే వినబడకూడదంటున్నాడు
నా గొంతుక కూడా
ప్రతిపక్షందే అంటున్నాడు
అవును
నేను, నాలా ప్రశ్నించే వారు
నిత్య ప్రతిపక్షవాదులు
Comments
Post a Comment