ఆహ్వానం ...
వంశీ కలుగోట్ల// ఆహ్వానం ...//
************************************
రెక్కలు విప్పుకురా ఓ రాబందూ
శవాల్ని పీక్కుతినే గుంటనక్కా
మీకందరికీ ఇదే నా ఆహ్వానం
సకుటుంబ సపరివార సమేతంగా
మీరంతా తరలి రండి
ఇక్కడున్నదంతా జీవమున్న శవాలు
మీకిక విందుభోజనం తయారు
కోట్లాది భారతీయుల చేవచచ్చిన
శరీరాలు కుళ్ళిపోతున్నాయి
సిగ్గు చచ్చిన ఈ మనుషులను
పౌరుషం చచ్చిన ఈ పౌరులను
జనాభా పెంచే యంత్రాలుగా
మారిన నా ఈ ప్రియ భారతీయ జీవచ్చవాలు
మీకోసం తయారుగా ఉన్నాయి
చేవచచ్చిన నాయకులిచట
వెన్నెముక లేని శరీరాలతో
చెబుతుంటారు శ్రీరంగనీతులు
అంతా ఇక్కడున్నదంతా జీవచ్చవాలే
రెక్కలు విప్పుకురా ఓ రాబందూ
Comments
Post a Comment