... నీట తేలిన మానవత్వం

వంశీ కలుగోట్ల // ... నీట తేలిన మానవత్వం //
**************************************
ఈ మనుషులు నివురు గప్పిన నిప్పులు
మంచికైనా చెడుకైనా 

నిన్నా మొన్నటిదాకా
గొప్పెవడని వాడూ వీడూ గొడవపడ్డారు
విద్వేషాగ్నులు చిమ్ముకున్నారు
అసహనం పేరు చెప్పి అనవసర రచ్చ చేశారు
ఇవ్వాళ నివురు తొలగింది
నిప్పులాంటి మంచిగుణం బయటకొచ్చింది
విపత్తు విద్వేషాన్ని భగ్నం చేసింది
వెళ్లి చూడు చెన్నైకి దమ్ముంటే
 
ఏ మతం గొప్పదో ఏ వాదం గట్టిదో
ఆలయాలు కడిగిన ముస్లింని
అన్నం పెట్టిన మసీదుని
ఆశ్రయమిచ్చిన చర్చిని
గోప్పేదని, గొప్పెవరని అడిగి చూడు

ఇన్నాళ్ళూ ... విక్రుతత్వాన్ని చూపుకోవటానికి వేదికలైన
ఫేస్ బుక్, ట్విట్టర్ గట్రాలే
విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచి ఆసరానిచ్చాయి
నా మతమో నీ మతమో కాదు
మానవత్వమే గొప్పదని
నీరొచ్చి ముంచేదాకా తెలియరాలేదా 

ఈ దేశంలోనే కాదు
నా మతంలో నీ మతంలో కూడా
ఎప్పుడూ సహనం ఉంది
అసహనం ఉన్నది కొద్దిమంది బుర్రల్లో 

ప్రతిసారి ప్రకృతి వచ్చి
నివురుని విప్పి
నీ నగ్నత్వాన్ని
నీకు చూపాలంటే
నీ అస్థిత్వాన్ని కోల్పోతావు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...