దేవుడు - సన్యాసి

వంశీ కలుగోట్ల// దేవుడు - సన్యాసి//
************************************
దైవత్వం అంటే
మానవత్వాన్ని రక్షించేది కదా
పిచ్చి కాకపొతే
ఆ దైవత్వాన్ని రక్షిస్తానంటూ ఒకడొస్తే
నమ్మి నాయకుడిని చేసి
నెత్తినెక్కించుకుని ఊరేగడమేమిటి
     *          *          *
పెళ్ళాన్ని వదిలేసిన వాడు
పుణ్యాన్ని ఆశించిన వాడు
కాషాయం కట్టుకున్న ప్రతివాడూ
సన్యాసి కాడు, కాలేడు
అయినా సన్యాసం అంటే
వదిలేయ్యటమో పారిపోవటమో కాదు
సన్యాసం అంటే జయించటం

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

... గాయాలు