అప్పట్లో పండగలుండేవి భయ్యా ...
వంశీ కలుగోట్ల // అప్పట్లో పండగలుండేవి భయ్యా ... //
**********************************************
భయ్యా నీకు తెలుసో లేదో తెలీదు కానీ
మేము సేడ్డీలేసుకుని తిరిగే రోజుల్లో
మా ఊర్లో పండగ అంటూ ఒకటి ఉండేది భయ్యా
మా యాదిగాడు, యాకోబు గాడు, జోసేఫూ, నేనూ
పండగ గురించి పెద్దగా తెలియక పోయినా
మస్తు ఎంజాయ్ సేసేటోల్లం భయ్యా ...
******************************
భయ్యా నీకు తెలుసో లేదో తెలీదు కానీ
మేము సేడ్డీలేసుకుని తిరిగే రోజుల్లో
మా ఊర్లో పండగ అంటూ ఒకటి ఉండేది భయ్యా
మా యాదిగాడు, యాకోబు గాడు, జోసేఫూ, నేనూ
పండగ గురించి పెద్దగా తెలియక పోయినా
మస్తు ఎంజాయ్ సేసేటోల్లం భయ్యా ...
పండగ వస్తంది అంటే ముందు రోజు నుంచే
ఇంట్లో హంగామా మొదలయ్యేది భయ్యా
ఆడోల్లందరూ అర్దరాత్రి దాకా మేల్కొని
గోరింటాకు పెట్టుకుంటూ ఉండేవోల్లు
తెల్లారగానే ఇంటి ముందు కళ్లాపి జల్లి
పెద్ద పెద్ద రంగుల ముగ్గులేసే వాళ్ళు
సంక్రాంతికైతే ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మలు అదనం

మేమైతే భయ్యా ... గోలీలాట, బొంగరాలాట, చిల్లా గోడే
దాగుడుమూతలు, దొంగా పోలీస్ ఇలా ఆటలే ఆటలు
మామూలుగా టైంకి ఇంటికి తీసుకొచ్చే ఆకలి కూడా
ఆ వేళ గుడికెళ్ళిపోయింటాదేమో తెలియదు
పిండివంటల లిస్టు ఇంటివేపు పిలుస్తూ హడావిడి చేసినా
ఆటల్లో ఉండే మజా మిస్సయ్యేలా ఉండేది కాదు

భయ్యా ... సాయంత్రమైతే వాగు ఒడ్డున ఇసుకలో
ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలు, పరుగు పందేలు లాటివి ఎన్నో
ఆ పందాల హంగామా అంతా అయిపోయి భోజనాలు కాగానే
రాత్రి నుంచి తెల్లారే దాకా చింతామణి నాటకం
ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలు, పరుగు పందేలు లాటివి ఎన్నో
ఆ పందాల హంగామా అంతా అయిపోయి భోజనాలు కాగానే
రాత్రి నుంచి తెల్లారే దాకా చింతామణి నాటకం
అయినా ఆ రోజులే వేరులే భయ్యా ...
ఉగాది, దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్ మస్, పీర్ల పండగ ...
పండగ ఏదైతేనేం భయ్యా
అప్పట్లో మాకు పండగలు మాత్రమే తెలిసేవి
మతాలు తెలిసేవి కాదు ...
ఉగాది, దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్ మస్, పీర్ల పండగ ...
పండగ ఏదైతేనేం భయ్యా
అప్పట్లో మాకు పండగలు మాత్రమే తెలిసేవి
మతాలు తెలిసేవి కాదు ...
ఇప్పుడూ పండగలొస్తున్నాయి భయ్యా
కాకపొతే మా యాకోబు, యాదిగాడు, జోసెఫూ, నేనూ
అందరి పిల్లలూ కలిసి చేసుకునేలా అయితే లేవు
రాజకీయాలోచ్చి మనసులనుంచి దూరం చేసి
పండగలను మతాలకు పరిమితం చేసాయి కదా భయ్యా
కాకపొతే మా యాకోబు, యాదిగాడు, జోసెఫూ, నేనూ
అందరి పిల్లలూ కలిసి చేసుకునేలా అయితే లేవు
రాజకీయాలోచ్చి మనసులనుంచి దూరం చేసి
పండగలను మతాలకు పరిమితం చేసాయి కదా భయ్యా
అయినా భయ్యా పండగంటే కేవలం పది మంది కలవటం
ఊరి సివరున్న గుడికెళ్ళి దండం పెట్టేసుకుని
ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి ప్రార్థించటం మాత్రమే కాదు
పండగంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం భయ్యా
ఊరి సివరున్న గుడికెళ్ళి దండం పెట్టేసుకుని
ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి ప్రార్థించటం మాత్రమే కాదు
పండగంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం భయ్యా
లెంగ్తెక్కువైందంటావా భయ్యా ... ఏం చేస్తాం చెప్పు
ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన
రాక్షసబల్లుల గురించి పార్ట్లు పార్ట్లుగా సినిమాలు తీస్తే
ఎగేసుకొని సంతనంతా తీసికెళ్ళి చూస్తావు కానీ
కొన్నేళ్ళ క్రితం పండగలెలా ఉంటాయో సెప్తే సిరాకేస్తందా భయ్యా

Comments
Post a Comment