నీవు ...
వంశీ కలుగోట్ల// నీవు ...//
*****************************
ఎందుకు
ఎపుడూ ఎవరితోనో
నిన్ను పోల్చాలనుకుంటావు
చందమామలాగానో
గులాబీలాగానో
మెరిసే తారకలాగానో
ఇంకెలాగోనో
మరేవరిలాగానో
ఎందుకివన్నీ ...?
ఎవరిలానో ఉన్నావనో
ఎవరినో మరిపిస్తావనో
నిన్ను ఇష్టపడలేదు
'నిన్ను'గానే ప్రేమించాను
'నీవు'గా ఉంటేనే నీకు అందం
Comments
Post a Comment