... ఈ కవితకు పేరు లేదు, ఒక జీవితం. అంతే
వంశీ కలుగోట్ల// ... ఈ కవితకు పేరు లేదు, ఒక జీవితం. అంతే //
**************************************************************
******************************
తెల్ల కాగితంలా మొదలైన జీవితాన్ని
మొదటి పేజీనుంచి చూస్తూనే ఉన్నా
ఏం సాధిస్తుందో ఈ జీవితం అని
ఎన్ని అబద్ధాలు, ఎన్ని భయాలు
పేజీకొకటి చొప్పున మోసుకుంటూ
జీవితాన్ని పుస్తకంలా ముందుకు తీసుకేళ్తున్నట్టు
రోజుకో కొత్త అబద్ధంతో
ప్రతి దానికి ఇతరులతో పోల్చుకుంటూ
బతికేస్తూ ఉన్నప్పుడు
తిప్పేసిన పేజీల్లోంచి ప్రశ్నలు పుట్టుకొచ్చాయి
'నీకుగా అనిపించేది ఎపుడు
నీవుగా తెలుసుకునేది ఎపుడు' అంటూ 'నీకుగా అనిపించేది ఎపుడు
తాహతు లేకపోయినా
తెల్ల ఏనుగు లాంటి కారును తెచ్చి
తెల్ల ఏనుగు లాంటి కారును తెచ్చి
నెత్తిమీది భారం పెంచుకుంటావు
బంధువెవడో ఇల్లు కొన్నాడని
అప్పు చేసి డబులో త్రిబులో బెడ్ ఫ్లాట్ ఒకటి కొనేస్తావు
ఇ.ఎమ్.ఐ. కట్టడానికి ఇబ్బంది పడతావు
పక్కింటివాడి కొడుకేవడో పైదేశాలకెళ్ళాడని
పక్కింటివాడి కొడుకేవడో పైదేశాలకెళ్ళాడని
నీ తనయుడి శక్తేమిటో, ఆసక్తేమిటో
తెలుసుకోకుండా అమీర్ పేటలో కోర్సొకటి చేయించి
ఖాళీగా కూచున్నాడని తిడతావు
ఇరుగూ పొరుగూ ముందూ వెనుకా
వీళ్ళేనా నీ జీవితాన్ని నడిపించేది
నీకుగా అనిపించేది
నీవుగా తెలుసుకునేది
నీ బుర్రలో చలనం కలిగేది ఎపుడు
చెత్తనంతా నింపుకుంటూ
బ్రతుకంతా
యీసురోమని ఈడుస్తున్నావు
యీసురోమని ఈడుస్తున్నావు
ఎవరితోనో పోటీ పడుతూ
ఎక్కడికో ఎదిగిపోతున్నాననుకుంటూ
ఎక్కడికో ఎదిగిపోతున్నాననుకుంటూ
చివరిపేజీ కొచ్చేసరికి
ఆనందం కోసం వెతుక్కుంటావు
నీ జీవితాన్ని
గ్రంధాలయంలో పుస్తకంగా మిగులుస్తావో
చెత్తకుప్పలో
చిత్తుకాగితం చేస్తావో
నిర్ణేతవు నీవే
Comments
Post a Comment