... వార్తలు/వాస్తవాలు
వంశీ కలుగోట్ల // ... వార్తలు/వాస్తవాలు // *************************************** ఒక భారీ వర్షం నగరాన్ని పలకరించిన వేళ మురుగునీటి ఉధృతికి మాన్ హోల్ మూత తెరుచుకుంది అవసరమైనదేదో కొందామని ఇంటినుండి బయటకొచ్చిన సామాన్యుడు దానికి బలయ్యాడు ఒక కుటుంబం బాధ పడింది మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది * * * బాధ్యతలు తరుముతుంటే బతుకు పోరాటంలో భాగంగా రోజూలానే వాడు బైక్ మీద ఆఫీసుకి బయల్దేరాడు తాగుడు హైజాక్ చేసిన మనిషొకడు డ్రైవర్ గా నడుపుతున్న లారీ ఒకటి వెనకనుండి వాడిని గుద్దింది తప్పిచుకునే అవకాశమూ లేదు వాడి జీవితం అక్కడే ముగిసిపోయింది ఒక కుటుంబం బాధ పడింది మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది * ...