అక్షరాలు ...

వంశీ కలుగోట్ల// అక్షరాలు ... //
*******************************
1
కనిపించీ కనిపించక
వినిపించీ వినిపించక
నాలో నేను ... నాతొ నేను 

వ్యక్తమో అవ్యక్తమో తెలియని
భావాలన్నిటినీ
మూటగట్టుకుని
అక్షరాలుగా ఒలకబోసుకుంటూ
రాలిపడిన సిరా చుక్కల అంచున
జీవితాన్ని వెతుక్కుంటున్న స్వాప్నికుడిని

2
వెన్నెల్లో ఆడుకోవడానికి
అందమైన ఆడపిల్లలు కాదు
సముద్రపు ఒడ్డున
ఇసుకలో గీతలు గీసుకోవడానికి
అమాయకపు చిన్న పిల్లలూ కాదు
నా అక్షరాలు
కొన్ని భావాలను ఎగరేసే ఝెండాలు

3
జాతి మొత్తం నిద్దుర లేచేవేళ
రక్తమోడుతున్న రంగుతో
తూరుపుదిక్కున తెల్లారుతుంది
నా అక్షరాలు వెళ్లి
ఎవడి గుండెల చీకటిని చీల్చాయో అనిపించేలా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...