సినీ'మాయ' భయాలు ...

వంశీ కలుగోట్ల // సినీ'మాయ' భయాలు ... //
*******************************************
ఇంటిముందు ఉన్న పిచ్చిమొక్కని
పీకేద్దామంటే 'మొక్కే కదా అని పీకేస్తే ...'
అంటూ ఇంద్రసేనారెడ్డి వస్తాడేమో అనిపిస్తుంది
*          *          *
ఆకాశంలో మెరుపులు మెరిసినప్పుడల్లా
యే ఆదికేశవరెడ్డో ఎక్కడన్నా జైలు ముందర
తొడ కొట్టాడేమో అని దడ పుడతాది
*          *          *
మా ఏరియాలో ఎండలు మండిపోయినప్పుడల్లా
ఈ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి మళ్ళీ
మా సీమకు తిరిగి ఎప్పుడొస్తారో అనిపిస్తుంది
*          *          *
నేను కొన్న పుస్తకానికి రెండోవైపున  
ఏముందో అని చూడాలంటే భయమేస్తుంది
చూస్తే ఎక్కడ మాడిపోతానో అని
*          *          *
ఈ మధ్యన అసలు ధియేటర్ కి వెళ్ళాలనే
ఆలోచన రాగానే దడ పుడుతోంది
ఎక్కడ సృజనాత్మక చిత్రాలు 'ఎటాక్' చేస్తాయో అని

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...