ఇజాలు ...

వంశీ కలుగోట్ల// ఇజాలు ... //
*****************************
నచ్చిన పిచ్చితనం వెంట నడవడమే
ఒక మహా ఆదర్శం అయితే
ప్రతి పిచ్చితనమూ ఒక ఇజమే
ప్రతి పిచ్చోడు ఒక మహా మేధావే 

పిచ్చితనాన్నే నిజమనుకుని
ప్రతి గాలిగాడూ నాదీ ఒక ఇజమని
ఊపుకుంటూ ఊరేగుతున్నాడు 

నిజానికి యే ఇజాలు లేవు భయ్యా
ఎవడికి పట్టిన పిచ్చిని వాడు
ఒక ఇజం అనుకుంటూ సంబరపడుతున్నారు
నువ్వు చేసే పనే నీ ఇజం
మిగతా ఇజాలన్నీ గాలి కబుర్లే
నమ్ము, నమ్మకపో - ఇది నా ఇజం ☺

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...