పిడికెడు ధూళి ...
వంశీ కలుగోట్ల// పిడికెడు ధూళి ...//
**********************************
******************************
ఎవరో ఒక మేధావి
ఎప్పుడో యుగాలనాటి, శతాబ్దాల క్రితపు
దాడులు జరిగినప్పుడు
పోయినదెవరో తెలీకపోయినా
రాజకీయం రంగప్రవేశం చేసి
ఏదో ఒక మతం/వర్గం రంగు పులిమి
సామాన్యులను బలి చేస్తోంటే
మనమేం చేయ్యగలిగామని
నా మూలాలు వెతికి నన్నూ ఏదో ఒక వర్గానికి
అంటగట్టటం తప్ప సాధింపబడింది ఏముంది
నేనొక సామాన్యుడిగా
నువ్వొక మహా మేధావిగా గుర్తింపబడటం తప్ప
ప్రతి సందర్భంలోనూ
నవరంధ్రాలలో నైరాశ్యం నింపుకుని
నా బతుకుబండిని లాగిస్తున్నాను
నువ్వొక మేధావివి కాబట్టి
'ఉగ్ర'మూలాలు వెతికే దమ్మూ లేదు
దాష్టీకాన్ని అడ్డుకునే శక్తీ లేదు
నా సామాన్యత్వపు మూలాలు వెతికటం తప్ప
నువ్వు ఊడబొడిచిందేమీ లేదు
అందుకే గాలిబ్ చెప్పినట్టు
'ఎవరికీ పనికిరాని పిడికెడు ధూళి'
కాకపొతే మరింకేమవుతాం మనం
Comments
Post a Comment